- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు సవాల్
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహనిర్మాణ సంస్థలను అవినీతి సంస్థగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా.. ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని విమర్శించారు. అంతేగాకుండా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదని వెల్లడించారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేశారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో టీడీపీ కోర్టుకు వెళ్లినట్టు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. వచ్చే సంక్రాంతి నాటికి 2,62,000 మందికి ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే లబ్దిదారులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.