‘చేతగాకుంటే డీజీపీ రాజీనామా చేయాలి’

by  |
‘చేతగాకుంటే డీజీపీ రాజీనామా చేయాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర హైకోర్టు, డీజీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘చట్టప్రకారం పనిచేయడం చేతగాకుంటే రాజీనామా చేయాలని తాజాగా హైకోర్టు వ్యాఖ్యానించడంపై డీజీపీ, ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. గతంలో కూడా న్యాయస్థానం ఖాకీస్టోక్రసీ అనే పదాన్ని వాడిందని గుర్తు చేశారు. దాని అర్థమేమిటో డీజీపీ.. పోలీసులకు చెప్పారా? పోలీసులు ఎవరిపై ఆధారపడి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా (చట్టం) సక్రమంగా అమలు కావడం లేదని.. పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని విమర్శించారు.

పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయడం చేతగానప్పుడు డీజీపీ రాజీనామా చేయాలని రాష్ట్ర హైకోర్టు చెప్పినా ప్రభుత్వం స్పందించదా? అని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర డీజీపీకి చీవాట్లు పెడితే.. సీఎం జగన్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అండమాన్ కో, తీహార్ కో వెళ్లేవాళ్ల మాటలు వింటూ డీజీపీ తన పోలీస్ జీవితానికే మాయని మచ్చ వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇంటికి తాళ్లు కట్టినప్ప్పుడు అవేతాళ్లు ఈ ప్రభుత్వానికి ఉరితాళ్లవుతాయన్న ఆనాడే చెప్పామని, ఆనాడు చెప్పిన మాటలు, నేడు హైకోర్టు వ్యాఖ్యలతో రుజువయ్యాయి’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Read Also…

లోకేశ్ లేఖ సారాంశం ఇదే..!


Next Story

Most Viewed