ఫ్లాష్.. ఫ్లాష్.. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు..

by Anukaran |   ( Updated:2021-06-24 08:45:52.0  )
adimulapu suresh
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం సాధ్యం కాదు కాబట్టి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సురేశ్‌ తెలిపారు. ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగిందన్నారు. జులై 31లోగా పరీక్షల ప్రక్రియతో పాటు ఫలితాల విడుదల చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.

పరీక్షల ప్రక్రియకు సుమారు 45 రోజుల సమయం పడుతుంది కాబట్టి పరీక్షలు నిర్వహించడం కుదరదని నిర్ణయించిన ఏపీ సర్కార్ పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ తెలిపారు. ఇతర బోర్డులు పరీక్షలు రద్దు చేయడం వల్ల ఏపీ విద్యార్థులకు నష్టం జరగదని సురేష్ అన్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed