- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీ వెనుక ఉన్న దుష్టశక్తి ఎవరో : తమ్మినేని
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయం కాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోందని.. ఇది చాలా బాధాకరమని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజ్యాంగ పదవులను కొంతమంది అపహాస్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ తెలిపారు. అయినా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వటం దారుణమని స్పీకర్ తప్పుపట్టారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా.. నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఉన్న ఏ దుష్టశక్తి ఉందని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానం ప్రజల పక్షాన తీర్పు చెప్పిందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇంత రాద్ధాంతం ఎందుకని, ఓ రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోందని స్పష్టమవుతోందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.