నిమ్మగడ్డ టైమ్ ఓవర్.. నేటితో పదవీకాలం పూర్తి

by Anukaran |
నిమ్మగడ్డ టైమ్ ఓవర్.. నేటితో పదవీకాలం పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తయ్యే సమయం వచ్చేసింది. ఇవాళతో (31 మార్చి 2021) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియనుంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది అంటూ ఎన్నికలను అకస్మాత్తుగా నిలిపివేసిన తర్వాత.. సీఎం జగన్ నేరుగా విమర్శలు చేశారు. తరువాత ఆయన ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైతే వైసీపీ ప్రభుత్వం మాత్రం నో అని చెప్పగా.. ఎన్నికలు నిర్వహించేశారు. ప్రతీ విషయంలో ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూనే వచ్చాయి. ఇంతవరకూ దేశంలో ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానంతగా, నిమ్మగడ్డ ఫేమస్ అయ్యారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసేందుకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అపాయింట్‌ మెంట్‌ దొరకలేదు. నిమ్మగడ్డ పదవీకాలం బుధవారంతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్‌ కోరుతూ నిమ్మగడ్డ నాలుగు రోజుల క్రితమే రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులకు తెలియజేశారు. అయితే నిమ్మగడ్డను కలిసేందుకు గవర్నర్‌ ఆసక్తి చూపలేదని సమాచారం. మంగళవారమంతా కమిషన్‌ కార్యాలయంలో ఉన్న నిమ్మగడ్డ గవర్నర్‌ కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూశారు. మరి పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన ఏం చేస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed