ఏపీ ఎస్ఈసీకి మరోషాక్.. ఏకగ్రీవాలపై హైకోర్ట్ ఆదేశాలు

by Anukaran |   ( Updated:2021-03-16 01:42:31.0  )
ఏపీ ఎస్ఈసీకి మరోషాక్.. ఏకగ్రీవాలపై హైకోర్ట్ ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏకగ్రీవమైన సీట్లపై విచారణ జరిపే హక్కు ఎస్ఈసీకి లేదని తేల్చి చెప్పింది. కాబట్టి గతంలో ఏకగ్రీవమైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఫామ్స్ ఇవ్వాలంటూ హైకోర్ట్ స్పష్టం చేసింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ సమయంలో అధికార పార్టీ వైసీపీపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డరమేష్ కు ఫిర్యాదు చేశారు. కడప, రాయలసీమల్లో అభ్యర్ధులతో బలవంతంగా విత్ డ్రా చేయించి, ఏకగ్రీవాలు చేయించుకుందని, తాము నామినేషన్ వేయకుండా బలవంతంగా ఏకగ్రీవాలు చేయించుకున్నారని, వెంటనే ఏకగ్రీవాల్ని రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఎస్ఈసీ ఫిర్యాదుపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. తాజాగా జరిగిన హైకోర్ట్ విచారణలో ఏకగ్రీవాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఏకగ్రీవాలపై విచారణ చేపట్టే అధికారం ఎస్ఈసీకి లేదని, వెంటనే ఏకగ్రీవమైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఫామ్స్ ఇవ్వాలని ఉత్తర్వులను వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed