చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద కాన్వాయ్‌కు ఆవు అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.

Advertisement