ఏపీ బీజేపీ ఎంపీలకు షాకిచ్చిన ప్రధాని మోడీ

by srinivas |
PM Modi
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు దక్కలేదు. గత కేబినెట్‌లో చోటు దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదా కల్పించి ప్రమోషన్ ఇచ్చారు. ఇకపోతే కేంద్రమంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో కేబినెట్ పదవులపై ఏపీ బీజేపీ ఎంపీలు ఆశలు పెట్టుకున్నారు. ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో కలిపి మెుత్తం నలుగురు ఎంపీలు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులకు బీజేపీ హామీ ఇచ్చింది. తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆశలు పెట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం కర్నూలులోనే ఉన్నారు. మంత్రివర్గం జాబితాలో పేరులేకపోవడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. మరోవైపు సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావులు ఢిల్లీలోనే మకాం వేశారు. సుజనా చౌదరి గతంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఈసారి తనకు అవకాశం వస్తుందని సీఎం రమేశ్ ఆశపడ్డారు. కానీ ఆయన ఆశలు కూడా ఆడియాసలు అయ్యాయి. దీంతో ఏపీ బీజేపీ నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Advertisement

Next Story

Most Viewed