- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో మరికాసేపట్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మరికొన్ని గంటల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెలువడనున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అన్‌లైన్ ద్వారా ఫలితాలు విడుదల చేయనున్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఫలితాల వెల్లడికి సంబంధించి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ సూచనల మేరకు ఫలితాలు వెల్లడి చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు టెన్త్, ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల నుంచి 70% వెయిటేజ్, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30% శాతం వెయిటేజ్‌గా తీసుకోనున్నారు. విద్యార్థులు ఇంటెర్నెట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. http://examresults.ap.nic.in , http://results.bie.ap.gov.in, http://results.apcfss.in , http://www.manabadi.co.in వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.