- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10 మందిని చంపుతావా?.. లోకేశ్‌పై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న హత్యలకు రాజకీయ రంగు పులుముతూ పబ్బం గడుపుతున్నారంటూ విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగినవే తప్ప రాజకీయ కక్షలతో కాదన్నారు. అవేమీ తెలుసుకోకుండా లోకేశ్ అక్కడకు వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడని మండిపడ్డారు.
ప్రజలను రెచ్చగొడుతున్న లోకేశ్.. మీ ప్రభుత్వ హయాంలో 30కిపైగా రాజకీయ హత్యలు జరిగాయని, వాటికి సమాధానం చెప్పగలవా? అంటూ సవాల్ విసిరారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీడీపీ నేతలు ఇలాంటి ఘటనలను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ రాజ్యాంగం నడిచిందో లోకేశ్, చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్ ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరిస్తున్నాడంటే.. టీడీపీ అధికారంలోకి వస్తే ఒకటికి పది మందిని చంపుతానని హెచ్చరిస్తున్నారా? అని హోమంత్రి మేకతోటి సుచరిత నిలదీశారు.