జడ్జికి నోటీసులు : కోర్టులో తహసీల్దారుకు షాక్ 

by  |
జడ్జికి నోటీసులు : కోర్టులో తహసీల్దారుకు షాక్ 
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా బి.కొత్తకోట జడ్జి రామకృష్ణ ఇంటి నుంచి బయటికి రాకుండా తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పది రోజుల పాటు సస్పెండ్ చేసింది. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలు న్యాయ, చట్టవిరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.

జడ్జి రామకృష్ణను ఇంట్లో నుంచి బయటికి రావద్దంటూ అక్కడి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై రామకృష్ణ తరఫు న్యాయవాది శ్రావణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక జడ్జిని ఇంట్లోనుంచి బయటకు రావద్దని ఎలా ఆదేశాలు ఇస్తారని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, భావప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకున్నట్లు అవుతుందని రామకృష్ణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను ఈ మేరకు సస్పెండ్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 10 రోజుల తర్వాత వాదనలు విని తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.


Next Story