ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

by srinivas |
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిడెడ్ కళాశాలల విషయంలో హైకోర్టులో, ప్రభుత్వానికి చుక్కెదురైంది. కళాశాలల్లో అడ్మిషన్లను కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలిపివేయడం, కళాశాలల స్వాధీనంపై కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లను ఆపివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిందని, దానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు తెలియజేశారు. అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం నిర్ణయాన్ని కొట్టి వేసింది. ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్‌పై కూడా త్వరలోనే విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed