ప్రైవేట్ టీచర్స్ కి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ 

by  |
ప్రైవేట్ టీచర్స్ కి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ 
X

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో పనిచే స్తున్న ఉపాధ్యాయ, అధ్యాపకులు జీతాలు ఇవ్వని యాజమాన్యాలపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించింది. టీచర్లుకు జీతాలు ఇవ్వని పాఠశాలల యాజమాన్యాలకి నోటీసులు జారీ చేయాలని డీఈఓలను ఆదేశిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.

లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వారు వేతనాలు చెల్లించటం లేదని వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను యాజమాన్యం ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వని ప్రైవేటు పాఠశాలలను గుర్తించాలని డీఈఓలకు తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం కావాలని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed