- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విగ్రహాల ధ్వంసం కేసులపై సిట్‌ఏర్పాటు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసులను ఛేదించేందుకు ప్రభుత్వం 16 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) చీఫ్‌గా విజయవాడ ఏసీబీ అడిషనల్డైరెక్టర్ జీవీజీ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ దర్యాప్తు బృందంలో కృష్ణా, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 15 మంది పోలీసు అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటిదాకా నమోదైన విగ్రహాల ధ్వంసం కేసులపై దర్యాప్తు చేయనున్నారు. ప్రభుత్వం తొలుత ఈ కేసులను సీఐడీకి అప్పగించింది. కేసుల్లో సత్వర పురోగతి కోసం ప్రభుత్వం సిట్‌ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story