రోశయ్య మరణంతో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

by srinivas |   ( Updated:2021-12-04 04:12:56.0  )
rosaiah
X

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. శనివారం నుంచి సోమవారం వరకు వైసీపీ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. ఇకపోతే రాజకీయ కురువృద్ధుడు అయిన రోశయ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

అయితే శనివారం ఉదయం​ బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే మార్గమధ్యలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు గవర్నర్‌గానూ పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

రోశయ్యకు రాహుల్, రేవంత్ నివాళులు

Advertisement

Next Story

Most Viewed