బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు 

by  |
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు 
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది. ప్రైవేట్ పార్టనర్‌ని గుర్తించే బాధ్యతను అప్పగించడంతోపాటు ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్‌లతో నాలెడ్జ్‌ పార్టనర్‌లుగా ఎంవోయూ చేసుకోవాలని ఆదేశించింది. కాగా 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో ఏపీఐఐసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (APBDIC) ఏర్పాటుకు అనుమతినిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. ఈ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా వేసింది ఏపీ సర్కార్. దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed