జల వివాదం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-07-12 10:58:36.0  )
cm-jagan mohanreddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య వివాదం జరుగుతున్న కృష్ణా జలాల విషయంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అంతరాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని సుప్రీంను ఏపీ ప్రభుత్వం కోరనుంది.

తక్షణమే తెలంగాణ జీవోను రద్దు చేయాలని, కేఆర్‌ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను ఏపీ కోరనుంది. రైతుల, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని, సముద్రంలోకి విలువైన జలాలను కలిసేలా పరిస్థితులు సృష్టించి మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed