ప్రజలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై ప్రతీ ఇంటికి..

by Anukaran |   ( Updated:2021-06-15 06:15:33.0  )
ప్రజలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై ప్రతీ ఇంటికి..
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో జల్‌జీవన్ మిషన్‌పై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం వర్క్‌షాప్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ టెక్నికల్‌ హ్యాండ్‌బుక్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2024 నాటికి రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా నీటి వసతి క‌ల్పిస్తామ‌న్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది రూ.7251 కోట్లతో ప‌నులు చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు. వాటర్ గ్రిడ్‌తో మంచినీటి సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్ట‌నున్న‌ట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story