- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానిపై హైకోర్టులో సర్కార్ అఫిడవిట్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా లేక రాష్ట్ర ప్రభుత్వానిదా అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అనే విషయం కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపిందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
రాజధానిపై సమీక్షించే విస్తృత అధికారం రాష్ర్ట ప్రభుత్వానికే ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రావని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ప్రకటించే వరకు విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్లే అని భావించాలని కోర్టుకు తెలిపింది.
Advertisement
Next Story