- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇకపై వారికి కూడా వైఎస్సార్ జలకళ వర్తింపు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ జలకళ పథకానికి సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిచేయని బోర్లున్న రైతులకూ వైఎస్సార్ జలకళ వర్తింప జేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉన్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అనర్హులని తెలిపింది. రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతు గ్రూపులకూ పథకం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే వైఎస్పార్ జలకళ వర్తిస్తుందని వెల్లడించింది. పొలంలో మొదటి బోరు విఫలమైతే హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వేలో నీటి లభ్యత నిర్ధారణ అయ్యాకే రెండో బోరు వేసేలా నిబంధనలను రూపొందించింది.
Next Story