అదనపు రుణానికి అనుమతివ్వండి : బుగ్గన

by srinivas |
అదనపు రుణానికి అనుమతివ్వండి : బుగ్గన
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను కౌన్సిల్ భేటీలో ప్రస్తావించారు. రెండుశాతం అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి కోరిన బుగ్గన… 2019-20 ఏడాది వృద్ధి రేటును మూడు శాతంగా పరిగణించాలని కేంద్రాన్ని కోరారు. జీఎస్టీ పరిహారం, బకాయిలు రాష్ట్రాలకు ముందుగా చెల్లించాలన్న బుగ్గన… సెస్, సర్‌చార్జీల మొత్తం కేంద్ర ఖాతాకు జమ చేశారని వివరించారు.

Advertisement

Next Story