ప్రతిపక్షాలకు విద్యాశాఖ మంత్రి సవాల్

by srinivas |
ప్రతిపక్షాలకు విద్యాశాఖ మంత్రి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేతలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫైర్ అయ్యారు. జగనన్న విద్యా కానుకపై ప్రతిపక్షం బురద జల్లుతోందని విమర్శించారు. కేంద్రం నిధులతో విద్యాకానుక అమలు చేస్తున్నారంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం యూనిఫాం, పాఠ్య పుస్తకాలకు మాత్రమే కేంద్ర నిధులు ఉపయోగిస్తున్నామని, నోట్‌ బుక్స్, బ్యాగ్స్, షూస్, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. జగనన్న విద్యా కానుకపై ప్రతిపక్ష నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed