- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్త్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన
దిశ, ఏపీ బ్యూరో : టెన్త్ ఫలితాల కోసం ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా కారణంగా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, ఫలితాల వెల్లడికి ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్ ఫలితాలు ప్రకటన విడుదల చేశారు.
2019-20 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించి, 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన.. 3 ఫార్మెటివ్ అసెస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇకపోతే 2021 ఏడాది విద్యార్థులందరికీ అంతర్గత అసెస్మెంట్ మార్కులను 30 శాతానికి.. 70 శాతం వెయిటేజి స్లిప్ టెస్టులకు ఇవ్వాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫారసులకు ఆమోదం తెలుపుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.