కాల్పులు జరిపిన ఏపీ డీజీపీ

by Anukaran |   ( Updated:2020-07-11 05:56:29.0  )
కాల్పులు జరిపిన ఏపీ డీజీపీ
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆయుధాలెక్కుపెట్టారు. ఆయన ఆయుధాలెందుకు ఎక్కుపెట్టారన్న అనుమానం వచ్చిందా? అమరావతి రీజినయన్‌లోని మంగళగిరిలో గల ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు చెందిన ఫైరింగ్ రేంజ్‌ను కమాండో దుస్తుల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బలగాలకు అందించే అత్యాధునిక షార్ట్ వెపన్స్‌ను గౌతమ్ సవాంగ్ పరీక్షించారు. సరికొత్త అత్యాధునిక తుపాకీని లక్ష్యానికి ఎక్కుపెట్టి పలు రౌండ్లు కాల్చారు. అంతేకాదు, ఎడమ చేత్తో పిస్టల్ పట్టుకుని తన నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed