- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికే ఆదర్శంగా నిలిచాం : డీజీపీ
దిశ, వెబ్‌డెస్క్: సోలీసు సంస్మరణ వారోత్సవాలు ఏపీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో బాలికలు, మహిళలు అనేక దాడులు ఎదుర్కొంటున్నారని, దీంతో వారి రక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దిశ చట్టం రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. పోలీసుల కష్టాలపై సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉందని వెల్లడించారు.
అందుకే పోలీసులకు వీక్లీఆఫ్‌లు ఇచ్చారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని వెల్లడించారు. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. అంతేగాకుండా కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం జగన్ రూ.50 లక్షలు ప్రకటించారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఙతలు తెలియజేశారు.