- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP: కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపు అమల్లో ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
రేపటి నుంచి ఈ నెల 20 వరకు కర్ఫ్యూ సడలింపు చేయాలని సింఘాలు ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. అటు ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story