సారీ! మార్క్‌ఫెడ్ భవనాన్ని అప్పగించలేం !

by srinivas |
సారీ! మార్క్‌ఫెడ్ భవనాన్ని అప్పగించలేం !
X

దిశ, న్యూస్‌బ్యూరో: రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన పరస్పర అంగీకారం, కేంద్ర హోంశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వుల ప్రకారం కొన్ని భవనాలను ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని, అందులో భాగంగా సచివాలయంలోని భవనాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పామని, కానీ ‘ఏపీ మార్క్‌ఫెడ్’ భవనాన్ని మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పగించలేమని ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు.

ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 53ప్రకారం తొమ్మిదవ షెడ్యూలులో ఉన్న సంస్థలను రెండు రాష్ట్రాల మధ్య విభజన చేయాల్సి ఉన్నదని, అందులో భాగంగానే ‘మహాత్మాగాంధీ మార్క్‌ఫెడ్ భవన్’ కూడా విభజన జరగాల్సి ఉన్నదని, కొన్నింటిని ఇప్పటికే తెలంగాణకు అప్పగించినా కొన్నింటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం, నిర్ణయం జరగనందున అప్పగించలేదని వివరించారు. మార్క్‌ఫెడ్ భవనం విషయంలోనూ స్పష్టత రాలేదని, రెండు రాష్ట్రాలూ మళ్ళీ సమావేశమై సానుకూల నిర్ణయం జరిగేంత వరకు తెలంగాణకు ఆ భవనాన్ని అప్పగించడం కుదరదని తెలంగాణ ప్రధాన కార్యదర్శికి ఇటీవల రాసిన లేఖలో సాహ్ని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed