ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా నమోదైన కేసుల వివరాలివే!

by srinivas |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 4,250 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యియి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,76,977కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులోనే కరోనాతో 33 మంది మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు కొవిడ్‌ బారినపడి మృతిచెందిన వారిసంఖ్య 12,599కి చేరింది. గడచిన 24 గంటల్లో 5,570 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,19,605కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 44,773 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story