- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీకి సీఎం జగన్..? ఆ ఇద్దరితో కీలక భేటీ..!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హస్తినబాట పట్టనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యేందుకు అపాయింట్ మెంట్ కోరారు. ఇద్దరి అపాయింట్మెంట్ ఖరారు అయితే ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 4న అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఆ సమావేశం వాయిదా పడింది. ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను అమిత్ షాతో చర్చించాలని జగన్ భావించారు.
అది కాస్తా రద్దు అవ్వడంతో ఢిల్లీ వెళ్లి స్వయంగా కలవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఏపీ సీఎంవో ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. గత జనవరిలో హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఆ పర్యటనలో ఏపీలో ఆలయాలపై దాడులు, జమిలీ ఎన్నికలు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఉద్యోగుల విభజన, ఉమ్మడి ఆస్తుల విభజన వంటి అంశాలపై చర్చించారు. తాజాగా మరోసారి సీఎం జగన్ ఢిల్లీ పెద్దలను కలవాలనుకోవడం ఆసక్తికరంగా మారింది. రాజకీయ అంశాలపై చర్చించేందుకు వెళ్తున్నారా లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి నిధులు రాబట్టేందుకు వెళ్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.