విలేజ్ క్లినిక్స్..టెలీమెడిసిన్‌ది కీలక పాత్ర: జగన్

by srinivas |
విలేజ్ క్లినిక్స్..టెలీమెడిసిన్‌ది కీలక పాత్ర: జగన్
X

ఆంధ్రప్రదేశ్‌లో 1016 కరోనా కేసులు నమోదై, తెలంగాణను కరోనాలో బీట్ చేయడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో సీఎం జగన్ సమీక్షా సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. కరోనా వైరస్ నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ క్లినిక్స్ కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. కరోనా ల్యాబ్‌లు లేని జిల్లాల్లో వెంటనే ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

దీనిపై అధికారులు సీఎంకు వివరిస్తూ, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6,928 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 61,266 పరీక్షలు నిర్వహించామని వివరించారు. కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. టెలిమెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని జగన్‌ ఆదేశించారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని చెప్పారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. టెలి మెడిసిన్‌కు మరింత ప్రచారం కల్పించాలని అధికారులకు జగన్ సూచించారు.

విద్యాశాఖతో జరిపిన సమీక్షలో ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో ఫర్నీచర్, చాక్ బోర్డులు తదితర వస్తు సామగ్రి కోసం టెండర్లు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి గాను స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫాం దుస్తులు, స్కూలు బ్యాగుల నమూనాలను సీఎంకు చూపించారు. ఆయన వాటిని పరిశీలించారు. అనంతరం వాటిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

tags:high level review meeting, ap, ys jagan, ap cm, tadepalli, ysrcp

Advertisement

Next Story

Most Viewed