ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్

by srinivas |
ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన సీఎం.. సాయంత్రం 5గంటలకు హస్తినలో అడుగుపెట్టారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ఉన్నారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్న సీఎం జగన్.. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేయాలని కోరనున్నారు. ప్రధాని మోడీతో కూడా సీఎం జగన్‌ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed