‘వారికి ఎలాంటి లోటు రానివ్వకండి’

by srinivas |
‘వారికి ఎలాంటి లోటు రానివ్వకండి’
X

దిశ, ఏపీ బ్యూరో: హైవేలపై కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు భోజనం, ఇతర సదుపాయల విషయంలో ఎలాంటి లోటు రానివ్వకూడదని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఖర్చుల సంగతి ఆలోచించవద్దని, ఉదారత, మానవతా దృక్పథంతో వారికి సాయం అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలోనే మానవత్వాన్ని చూపించాలని సూచించారు. రాష్ట్రం మీదుగా వెళ్లే వలస కూలీలకు అందుతున్న సాయంపై ఆదివారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు అందిన సాయం గురించి అధికారులను అడిగి తెలుకున్నారు.

రహదారులపై నడిచి వెళ్తున్న ఒడిశాకు చెందిన 902 మందిని షెల్టర్లకు పంపించి అన్ని సదుపాయాలు కల్పించామని, అనంతరం వారందరినీ బస్సుల్లో స్వస్థలాలకు తరలించినట్టు అధికారులు వివరణ ఇచ్చారు. ప్రకాశం జిల్లా నుంచి 470 మందిని 10 బస్సుల్లో, కృష్ణా జిల్లా నుంచి 410 మందిని 16 బస్సుల్లో, శ్రీకాకుళం జిల్లా నుంచి 22 మందిని ఒక బస్సు ద్వారా తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం గుంటూరు నుంచి 450 మంది, కృష్ణా జిల్లా నుంచి 52 మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed