ఏపీ రైతులకు సీఎం జగన్ వరాలు

by  |
ఏపీ రైతులకు సీఎం జగన్ వరాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు వరాలు ప్రకటించారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ఆయన.. ఈ సందర్భంగా అన్నదాతలకు తీపి కబురు అందించారు. రైతులకు వడ్డీలేని రుణాలను అందించేందు రూ.1150 కోట్లను విడుదల చేశారు. టీడీపీ హయాంలో బకాయిపడ్డ ఈ రుణాన్ని సీఎం జగన్ రిలీజ్ చేశారు. ఇవేగాక గతంలో రూ.96.50 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ..రుణ మాఫీని 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ఖాతాల్లో డబ్బు రాని రైతులు ఆందోళన చెందవద్దని జగన్ తెలిపారు. కాస్త ఆలస్యమైనా..అందరికీ ఈ సాయం అందుతుందని స్పష్టం చేశారు. చెరుకు రైతులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తాము చెల్లిస్తున్నామని వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల పక్షపాతి అని మరోసారి జగన్ గుర్తు చేశారు.


Next Story

Most Viewed