ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే 

by  |
ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే 
X

దిశ, వెబ్ డెస్క్: ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోదావరి వరద పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలన్నారు. విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. మరికొద్దిసేపట్లో గోదావరి ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వేకి వెళ్లనున్నట్టు అధికారులకు తెలియజేశారు.


Next Story

Most Viewed