ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడండి: జగన్

by srinivas |   ( Updated:2020-04-23 08:05:24.0  )
ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడండి: జగన్
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల వివరాలు, తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు, ప్రజల నిత్యావసరాలు వంటి వివరాలపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహంచారు. ఈ సమావేశంలో అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వారి వైద్య సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, చూడాలని ఆదేశించారు. అలాగే ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. మూడు జిల్లాల్లో కరోనా కేసులు పెరగడంపై అధికారులు వివరణ ఇస్తూ… కరోనా పరీక్షలు విస్త్రృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ కేసులు, వాటిలోనూ ప్రధానంగా డెలివరీ కేసులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రజలకు ఏ సమస్య వచ్చినా 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు. ఇతర సమస్యలకు 1902కు కాల్‌ చేస్తే పరిష్కరిస్తున్నామని వారు అన్నారు. ఈ సందర్భంగా కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలని జగన్‌ ఆదేశించారు. రబీ సీజన్ పంట విక్రయానికి గ్రామాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను రైతులు సంప్రదించాలని సూచించారు.

పంటల ధరలు, పరిస్థితులపై ఎప్పటికప్పుడు వారి ద్వారా ప్రభుత్వానికి నివేదించవచ్చని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తున్న 100 రూపాయలకే వివిధ రకాల పండ్లు ఇవ్వడాన్ని కొనసాగించాలని సూచించారు. దీనిని శాశ్వతంగా కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags: high level review meeting, ap cm, ys jagan,

Advertisement

Next Story

Most Viewed