- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్మగడ్డ అదనపు పీఎస్‌ను విచారించిన సీఐడీ
ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అదనపు పర్సనల్ సెక్రటరీగా పని చేసిన సాంబమూర్తిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన కాలంలో కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై తొలుత ఆయన స్పందిస్తూ, తాను రాయలేదని, ఎవరు రాశారో తెలియదని ప్రకటించిన సంగతి మాధ్యమాల్లో ప్రసారమైంది. అనంతరం ఆయన హైదరాబాదు తరలడం, ఆఫీసును కూడా హైదరాబాదులో ఏర్పాటు చేయడం, దీనిపై తీవ్ర వివాదం రేగడం, ఆయనను పదవీచ్యుతుడ్ని చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తరంపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సీఐడీ కేసు విచారిస్తున్న నేపథ్యంలో దీనిపై సాంబమూర్తిని సీఐడి అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని ఏపీ సీఐడీ కార్యాలయంలో ఆయనను సీఐడీ ఏడీజీ వీపీ సునీల్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంబమూర్తిని విచారించింది.
tags: ap ex-sec, nimmagadda ramesh kumar, cid enquiry, ap cid