విశాఖలో ఆగస్ట్ 15 నుంచి పరిపాలన..?

by  |
విశాఖలో ఆగస్ట్ 15 నుంచి పరిపాలన..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ కల నెరవేరింది. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలనే ప్రతిపాధనలు తెచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును జ్యూడిషియల్ రాజధానిగా సీఎం ప్రకటించారు. అయితే దీనిని ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అమరావతిలో నేటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా జగన్ ముందుకు వెళ్లారు. తాజాగా గవర్నర్ మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం దూకుడు పెంచనున్నారు.

ప్రస్తుతం శ్రావనమాసం నడుస్తోంది. ఈ మాసంలో మంచి ముహుర్తాలు ఉంటాయి. శుభకార్యాలకు, పెళ్లిలకు మంచిరోజులు. ఇవ్వే ముహూర్తాలకు సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే అధికారులు విశాఖలో పరిపాలనకు సంబంధించిన భవనాలు సిద్ధం చేసినట్టు సమాచారం. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే కార్యాలయాల తరలింపును వేగవతంగా ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 15 నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంద్రాగస్ట్ వేడుకలు కూడా అక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ఆగస్ట్ 15న సీఎం కార్యాలయాలకు భూమి పూజ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటన్నాయి. దీనిపై అధికారికంగా ఇంకా ఎవరు స్పందించడం లేదు. అమరావతి నుంచి దశాల వారిగా కార్యాలయాలను కర్నూల్, విశాఖకు తరలించేందుకు అన్ని సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Next Story

Most Viewed