ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ

by srinivas |
apgovt
X

దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖలో నాడు-నేడు, పెన్షన్లపై విపక్షాల రాద్ధాంతం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి నూతన పరిశ్రమలు తీసుకువచ్చే అంశం.. థర్డ్ వేవ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇతర కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story