- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Budget Live: ఏపీ బడ్జెట్ హైలైట్స్.. ఏ రంగానికి ఎన్ని కోట్లు ఇచ్చారంటే..!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో 2021-22 వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రవేశపెట్టారు. ఈ సారి రూ. 2,29,779.27 కోట్లతో బడ్జెట్ అంచనా వేశామని ఆయన స్పష్టం చేశారు. గతేడాది బడ్జెట్ అంచనా రూ. 2,24,789.18 కోట్లు.
2021-22 వార్షిక బడ్జెట్ కేటాయింపులు
*వెనుకబడిన కులాలకు 32 శాతం అదనంగా కేటాయింపులు
*వెనుకబడిన కులాల సంక్షేమం కోసం రూ. 28,237 కోట్లు
*ఈబీసీ సంక్షేమం కోసం 5,478 కోట్లు
*కాపు సంక్షేమానికి 3,306 కోట్లు
*ఎస్సీ సబ్‌ప్లాన్ కోసం రూ. 17,403 కోట్లు
*ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం రూ. 6,131 కోట్లు
*బ్రహ్మణుల సంక్షేమానికి రూ. 3,059 కోట్లు
*మైనారిటీ యాక్షన్ ప్లాన్ రూ. 3,840.72 కోట్లు
*మహిళా సంక్షేమం 47,283.21 కోట్లు
*చిన్నారులు, పిల్లల సంక్షేమం రూ. 16,748 కోట్లు
*వ్యవసాయ పథకాలు రూ. 11,210 కోట్లు
*వైద్య, ఆరోగ్యం రూ. 13,830 కోట్లు
*విద్యా పథకాల అమలు కోసం 24,624 కోట్లు
*జగనన్న విద్యా దీవెన రూ. 2,500 కోట్లు
*వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 1,700 కోట్లు
*వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,845 కోట్లు
*జగనన్న వసతి దీవెన రూ. 2.223.15 కోట్లు
*వైఎస్సార్ పీఎం ఫసల్ బీమా యోజన రూ. 1,802 కోట్లు
*డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద చెల్లింపుల కోసం రూ. 865 కోట్లు
*పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల కోసం రూ. 247 కోట్లు
విద్యా రంగం
*స్కూళ్లలో నాడు-నేడుకు రూ. 3,500 కోట్లు
*జగనన్న గోరుముద్ద కోసం రూ. 1,200 కోట్లు
*జగనన్న విద్యా కానుక కోసం రూ. 750 కోట్లు
*ఉన్నత విద్య కోసం రూ. 1,973 కోట్లు
ఆరోగ్య రంగం
*వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94కోట్లు
*ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాల కోసం రూ. 1,535 కోట్లు
*కొవిడ్‌పై పోరాటం కోసం రూ. 1000 కోట్లు
*ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్ కోసం రూ. 100 కోట్లు
*హౌసింగ్, మౌలిక సదుపాయాల కోసం రూ. 5,661 కోట్లు
*పరిశ్రమలకు ఇన్సెంటివ్ కోసం రూ. 1000 కోట్లు
*వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్షరింగ్ కోసం రూ. 200 కోట్లు
*కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ. 250 కోట్లు
*ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు
*పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 3,673.34 కోట్లు
*రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులు రూ. 500 కోట్లు
*వైఎస్సార్ కాపు నేస్తం రూ. 500 కోట్లు
*వైఎస్సార్ జగనన్న తోడు రూ. 300 కోట్లు
*వైఎస్సార్ వాహన మిత్ర రూ. 285 కోట్లు
*వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ. 120 కోట్లు
*మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కింద రూ. 50 కోట్లు
*అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ. 200 కోట్లు
*రైతులకు నష్ట పరిహారం కింద రూ. 20 కోట్లు
*లా నేస్తం కోసం రూ. 16.64 కోట్లు
*ఈబీసీ నేస్తం కోసం రూ. 500 కోట్లు
*వైఎస్సార్ ఆసరా కోసం రూ. 6,337 కోట్లు
*అమ్మఒడి కోసం రూ. 6,107 కోట్లు
*రైతుల పథకాలకు రూ. 11,210.80 కోట్లు
*వైఎస్సార్ టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ. 88.57 కోట్లు
*వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1802.82 కోట్లు
*వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ. 739.46 కోట్లు
*రోడ్లు భవనాల శాఖకు రూ. 7,594.6 కోట్లు
*ఎనర్జీ రంగానికి రూ. 6,637 కోట్లు
*వైఎస్సార్ సంపూర్ణ పోషణకు రూ. 1.556.39 కోట్లు
*వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ. 243.61 కోట్లు
*దిశకు రూ. 33.75 కోట్లు
*అంగన్వాడీల్లో నాడు-నేడు కార్యక్రమాల కోసం రూ. 278 కోట్లు
*వైఎస్సార్ బీమాకు రూ. 372.12 కోట్లు
*అర్చకుల ఇన్సెంటివ్ కోసం రూ. 120 కోట్లు
*ఇమామ్, మౌజంలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ. 80 కోట్లు
*పాస్టర్లకు ఇన్సెంటివ్‌ల కోసం రూ. 40 కోట్లు
*ల్యాండ్ రీ సర్వేకోసం రూ. 206.97 కోట్లు
*పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 8,727 కోట్లు
*2021-22లో నీటి పారుదల శాఖకు రూ. 13.237,78 కోట్లు