- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జూన్ 16 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో: ప్రభుత్వ కార్యకలాపాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. ఈ నెల 16 నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కాసేపట్లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద ఉంది. జూన్ 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవనుండగా, జూన్ 18న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఎన్నిరోజుల పాటు సమావేశాలు జరగాలన్నది బీఏసీ భేటీ అనంతరం తేలనుంది. కాగా, ఏపీలో వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఆఫీసులకు రావాలంటూ వారం క్రితమే ఉద్యోగులకు సీఎస్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Next Story