- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అదే పవన్ ప్రస్తావించారు : సోము వీర్రాజు
దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది బీజేపీ ఆలోచన అని అన్నారు. ఈ ఆలోచనపై దేశవ్యాప్త చర్చ జరగాలని ప్రధాని మోడీ చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రధాని చెప్పిన మాటలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని వెల్లడించారు. జమిలి ఎన్నికలు 2023లోనా… 2024లోనా అనేది దేశంలో పూర్తిస్థాయిలో చర్చ జరగాలని తెలిపారు. జమిలి ఎన్నికల్లో గెలుపు వారిదే అయితే.. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలెందుకు జరుగుతున్నాయని విమర్శించారు. తిరుపతి నుంచి ముఖ్య నేతలు బీజేపీలో చేరుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నుంచి ఓ సీనియర్ మంత్రి కుటుంబం నుంచి కూడా బీజేపీలో చేరికలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా పోలవరం ప్రాజెక్టు వద్ద వాజ్ పేయ్ విగ్రహం పెట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.