- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మీరు మాకు నీతులు చెప్పకండి’
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదని ఏపీ బీజేపీ ఘాటుగా సమాధానమిచ్చింది. హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్‌లో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ కలవడంపై ఏపీ వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీని కార్నర్ చేయాలన్న వైఎస్సార్సీపీ యత్నాలు బీజేపీకి ఆగ్రహం కల్గించాయి. దీంతో ఏపీ బీజేపీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ‘మీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదు’ అని స్పష్టం చేసింది. ‘మీ ప్రభుత్వ విధానాలపై, మీ ఎంపీ-ఎమ్మెల్యేల నిరసనల నుంచి దృష్టి మరల్చడానికే వైఎస్సార్సీపీ నేతలు హోటల్ విషయాన్ని మాట్లాడుతున్నారు’ అని ఆరోపించింది. ‘రమేశ్ కుమార్ బీజేపీ ఎంపీని కలిశారంటున్నారు, మరి రమేశ్ కుమార్‌ను ఎస్ఈసీగా గుర్తించారా?’ అంటూ ప్రశ్నించింది. ‘ఎస్ఈసీ విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా?’ అంటూ వైఎస్సార్సీపీని నిలదీసింది.