అమలాపురంలో టెన్షన్ టెన్షన్.. అదుపులోకి సోము!

దిశ, వెబ్‌డెస్క్ :

హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఏపీ బీజేపీ చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనికి ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అధ్యక్షత వహించనున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన్ను గురువారం పోలీసులు ముందస్తుగా గృహనిర్భంధం చేశారు. అంతేకాకుండా అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30,144 అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్.. ఏపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎంటనీ ప్రశ్నించారు. అంతేకాకుండా, గ్రామవాలెంటీర్ల ద్వారా తమ కేడర్ , మద్దతు దారులను వివరాలను ప్రభుత్వం సేకరించడం ఎంటనీ మండిపడ్డారు. ఏదీఏమైనా రేపు చలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తిరుతామని.. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా జగన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయని తెలిపారు.

Advertisement