ఏపీలో ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు..?

by srinivas |   ( Updated:2021-05-12 03:15:13.0  )
ఏపీలో ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి ఎపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకే రోజులో సమావేశాలను పూర్తి చేసేందుకు కూడా జగన్ సర్కార్ మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రటకన వెలువడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed