- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రేమను పంచుదాం.. పోయేదేముంది : స్వీటీ

‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్’ మరణంతో ఎంతో మంది సెలబ్రిటీలు బాధడుతున్నారు. యంగ్ టాలెంటెడ్ యాక్టర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తోటి నటుడు అంత ఒత్తిడిలో ఉంటే కనీసం పట్టించుకోలేక పోయామని.. ఆయన పోయాక ఫీల్ అవుతున్నారు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. కాబట్టి ‘ఇప్పుడైనా మారుదాం.. ఎదుటి వ్యక్తి కనపడినప్పుడు చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. అది వారిలో చాలా మార్పును కలిగిస్తుంది’ అని సూచిస్తోంది హీరోయిన్ అనుష్క శెట్టి.
‘మన పరిస్థితి మనకు మాత్రమే తెలుసు, దాన్ని పరిష్కరించే విధానం కూడా మనకే తెలిసుంటుంది. ఇక్కడెవ్వరూ పర్ఫెక్ట్ కాదు.. తప్పు, ఒప్పు అనే మార్గాలు లేవు. ఎందుకంటే లైఫ్‌ను లీడ్ చేసేందుకు మనం రోడ్ మ్యాప్‌తో పుట్టలేదు కదా’ అంటోంది స్వీటీ. మనలో చిన్న, పెద్ద ఎవరైనా సరే.. వారి సొంత మార్గాల్లో హాని కలిగివున్నారనేది వాస్తవమని చెప్తోంది. ప్రతి ఒక్కరూ బాధతో ఉంటారు.. కొందరు బయటకు ఏడుస్తారు.. కొందరు మౌనంతో కుంగిపోతుంటారు. మరికొందరు నిస్సహాయంగా చూస్తుంటారు. అలాంటి టైమ్‌లో బాధలు పంచుకునేందుకు ఒకరికొకరం భరోసానివ్వడం నేర్చుకుందామని సూచిస్తోంది స్వీటీ. మరింత దయగా..మరింత కరుణతో.. మరింత ప్రేమను పంచేందుకు ప్రయత్నిద్దాం. బలంగా ఉండటం, అనుభూతిని పొందడం నేర్చుకుందాం.. వీటన్నిటినీ కలుపుకుని ఎదగడం నేర్చుకుందాం అంటోంది.
‘చిన్న చిరు నవ్వు.. వినే చెవి.. మనమిచ్చే సున్నితమైన స్పర్శ.. మనకు తెలిసిన లేదా తెలియని వ్యక్తికి చాలా తేడాను ఇస్తుందని అనుష్క అభిప్రాయపడింది. ‘ఆ క్షణంలో మనం వారి సమస్యకు పరిష్కారం చూపించలేకపోవచ్చు. కానీ ఒక్క చిన్న అడుగు మార్పుకు నాంది పలుకుతుంది. అలాంటి మిలియన్ క్షణాల్లో మార్పు నెమ్మదిగా కలుగుతుంది.. కాదంటారా చెప్పండి. మనం మనుషులం, ఒకరికొకరం అండగా ఉంటూ.. సంతోషంగా నవ్వుకుందాం’ అని చెబుతోంది.
View this post on Instagram
A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on Jun 15, 2020 at 12:23am PDT