అప్పుడే ట్విట్టర్ ఎందుకులే : అనుష్క

by Jakkula Samataha |
అప్పుడే ట్విట్టర్ ఎందుకులే : అనుష్క
X

లేడీ సూపర్‌స్టార్ అనుష్క.. కెరియర్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్నా సరే, ఆ వినయం విధేయత చూస్తే చాలా ముచ్చటేస్తుంది. నిజానికి తన యాటిట్యూడ్ అంతే. ఫ్రెండ్స్‌తో ఎంత క్లోజ్‌గా మూవ్ అవుతుందో.. తెలియనివారికి అంతే దూరంగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండనని చెప్తుంది.

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ వర్చువల్ ఫ్యామిలీని పెంచుకుంటున్నారు సెలెబ్రిటీలు. కానీ అనుష్క మాత్రం అందుకు మినహాయింపు. ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ఉన్నా సరే యాక్టివ్‌గా ఉండదు. ట్విట్టర్ ఎకౌంట్ అసలు లేనే లేదు. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్కను ఇదే ప్రశ్న అడగ్గా.. కొత్త వారితో ముచ్చటించడం నాకు చేత కాదు. సినిమాలు చేయడం తప్ప తనకు వేరే ప్రపంచమే లేదని చెప్పింది. ఒక వేళ ఫ్యాన్స్‌కు ఏదైనా స్పెషల్‌గా చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్విట్టర్ ఎంట్రీ ఇస్తానని చెప్పింది. ఫ్యాన్స్‌తో రెగ్యులర్‌గా మాట్లాడతానని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed