- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కష్ట కాలమే.. కానీ జీవిత పాఠాన్ని నేర్పింది: అనుష్క

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రకృతితో కలిసి నడవాలే తప్పా.. ప్రకృతికి విరుద్ధంగా పనిచేయద్దన్న సంకేతాన్నిస్తోంది. జీవరాశులన్నింటిని గౌరవించాలని .. వాటిని బ్రతకనివ్వాలనే పాఠాన్ని చెప్తోంది. అదే సమయంలో మనిషి మనిషికి మధ్య ఉండే అనుబంధాన్ని చాటి చెప్పింది. మానవత్వం ఎంత విలువైందో ప్రబోధిస్తోంది. 24 గంటలు బిజీగా ఉంటామనుకునే మనుషులంతా… కరోనా దయ వల్ల తమ కుటుంబీకులతో మరింత అనుబంధాన్ని పెంచుకునే సమయం వచ్చింది.
ఇదే విషయాన్ని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. కోవిడ్ 19 వ్యాధి కారణంగా చాలా కష్టాలే చూస్తున్నాం కానీ… ఈ సమయం మనలో ఎంతో కొంత రియలైజేషన్ కలిగిస్తోంది అనేది వాస్తవం అంటోంది. ప్రతీ నల్లటి మేఘానికి వెండి గీత అనేది ఉన్నట్లే… లాక్ డౌన్ సమయం గడ్డు కాలం అయినప్పటికీ.. బిజీగా ఉన్నాం అని చెప్పి తప్పించుకునే ఎన్నో విలువైన పనులకు, బాధ్యతలకు మనల్ని దగ్గర చేస్తోందని చెప్పింది. మనిషి మరింత ప్రకాశించేందుకు ఎక్కువ కాంతిని పంచుతోందని అభిప్రాయపడింది. నాకు ఇప్పుడు భోజనం, నీరు, ఇళ్లు, కుటుంబ ఆరోగ్యం మాత్రమే ప్రధానం అనిపిస్తోందని.. వీటికి మించి నా దగ్గర ఉన్నవన్నీ బోనస్… అందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని తెలిపింది. కానీ కనీస అవసరాలు లేని వారు కూడా ఉన్నారని… వారు సురక్షితంగా, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్థానని చెప్పింది. ఈ సమయం నన్ను నాకు మరింత బాగా చూపిస్తుందన్న అనుష్క… జీవన పోరాటంలో పనిని, జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే విషయాన్ని అర్ధమయ్యేలా చేసిందని తెలిపింది. వాస్తవానికి ముఖ్యమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపింంది. భర్త విరాట్‌తో లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనుష్క… ఈ కష్టకాలంలో ఇతరులకు తప్పకుండా సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చింది.
Tags : Anushka Sharma, Virat Kohli, Covid 19, CoronaVirus