గౌతమ్ మీనన్‌తో అనుష్క నెక్ట్స్ మూవీ

by Shyam |
గౌతమ్ మీనన్‌తో అనుష్క నెక్ట్స్ మూవీ
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్ర‌స్తుతం నిశ్శ‌బ్దం సినిమాను పూర్తి చేసి త‌దుప‌రి సినిమాకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఆమె సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం అందరూ ఆమె పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నిశ్శబ్దం సినిమా విడదల తర్వాత శుభవార్త చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో ఆమె మరో సినిమాపై క్లారిటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలియ‌జేసింది. ఇది కాకుండా మ‌రో రెండు సినిమాల కోసం చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ట‌. అనుష్క న‌టించిన నిశ్శ‌బ్దం ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా విడుద‌ల గురించి సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ చిత్రాన్ని హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, హేమంత్ మ‌ధుక‌ర్ నిర్మిస్తున్నారు.

Tags: Anushka, Next Movie, Gautham Menon, nishabdham, april 2nd

Advertisement

Next Story