స్టార్ డైరెక్టర్‌ను కుక్కతో పోల్చిన నెటిజన్.. ఆవేశంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2021-11-20 02:51:26.0  )
స్టార్ డైరెక్టర్‌ను కుక్కతో పోల్చిన నెటిజన్.. ఆవేశంతో ఊగిపోతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మార్టిన్ స్కోర్సెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ మేరకు అనురాగ్ కశ్యప్ స్కోర్సెస్ కాళ్లు మొక్కుతున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2013లో కశ్యప్ స్కోర్సెస్‌తో దిగిన పిక్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పిక్ చూసిన మరో నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘సినిమా దేవుడితో కుక్క ఏం చేస్తోంది’ అని నెగెటివ్ కామెంట్‌ చేశాడు. దీంతో స్పందించిన కశ్యప్.. ‘భౌ వావ్’ అంటూ ఫన్నీగా స్పందించడంతో మరింత వైరల్ అయింది. ఈ క్రమంలో అనురాగ్ అభిమానులు కొందరు ఆ నెటిజన్ కామెంట్ క్రూరమైందని అభివర్ణించగా.. మరికొందరు అనురాగ్ రిప్లయికి నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే 2012లో అనురాగ్‌ తెరకెక్కించిన ‘దేవ్ డి’,‘ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్‌’ చిత్రాల గురించి మార్టిన్ చెప్పిన విషయాన్ని పోస్ట్ చేస్తూ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి వివరించారు అభిమానులు. ‘మీ అభిమానానికి, మీ చిత్రాలను పంపించినందుకు ధన్యవాదాలు. నేను మూడు నెలలుగా నా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. మొత్తానికి వాటిని చూడటానికి సమయం దొరికింది. రెండు సినిమాలు చాలా బాగున్నాయి. స్పూర్తిదాయకంగా అనిపించాయి. మీరు న్యూయార్క్ వస్తే తప్పకుండా కలుస్తాను. మీరు, మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను’ అని మార్టిన్ స్కోర్సెస్ చెప్పగా.. ‘ఇది నాకు అతిపెద్ద రివార్డు’ అంటూ అనురాగ్ రిప్లయి ఇచ్చాడు.

Photo :

Advertisement

Next Story