తాను మహారాణిని అంటున్న అనుపమ

by  |
తాను మహారాణిని అంటున్న అనుపమ
X

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. టాలీవుడ్‌లో అరంగేంట్రం చేయకుముందే తెలుగు అభిమానుల మనుసులు దోచుకుంది. మలయాళీ చిత్రం ‘ప్రేమమ్’లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమా హిట్ టాక్‌తో తెలుగులోనూ తెగ ఫేమస్ అయిపోయింది. భాష అర్థం కాకపోయినా ‘ప్రేమమ్’ చిత్రం యూత్‌ను బాగానే ఆకర్షించింది. ఆ క్రేజీనెస్ చూసి.. ఇక్కడ కూడా ఆ సినిమాను రీమేక్ చేశారు. అలా అనుపమ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ.. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియాలో మాత్రం తన హవా కొనసాగిస్తోంది. బుట్టబొమ్మలా రెడీ అయిన తన ఫొటో ఒకటి ఇన్‌స్టాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ.. ఓ కల గురించి చెప్పుకొచ్చింది.

‘నాకో కల వచ్చింది. ఆ కలలో నేనొక మహారాణిలా కనిపించాను. వెంటనే లేచి చూశాను. నిజమే ఇప్పటికీ నేను మహారాణినే’ అంటోంది అనుపమ. ఇక అనుపమ లుక్‌ను చూసి.. నెటిజన్లు కూడా అవును నువ్వు మహారాణివే అంటూ కితాబిస్తున్నారు. అనుపమకు ఇన్‌స్టాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అనుపమ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం నిఖిల్ కథానాయకుడుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ‘18 పేజెస్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం పలువుర్ని పరిశీలించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.



Next Story